బాబా భక్తులకు గురువారం పవిత్రమైనది. ఆ రోజు ఆయన్ని తలుచుకుంటే ,కోరుకుంటే కోరిక కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం,విశ్వాసం. అయితే బాబా భక్తులు ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు మాత్రమే కాక గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు శ్రీ సాయిసచ్చరిత్రము లో చక్కగా చెప్పబడ్డాయి. వాటిని ఓ సారి మననం చేసుకుందాం.
సాయిబాబా అద్భుతావతారము :
సాయిబాబా హిందువనుకుంటే వారు మహమ్మదీయునిలా కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకుంటే హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవారు. ఆయన హిందువా లేక మమ్మదీయుడా అన్న విషయం ఇదిమిద్దంగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఇత్సవాన్ని జరిపిస్తూ ఉండేవారు. అదేకాలంలో మహమ్మదీయుల చందనోత్సవాన్ని జరిపడానికి అనుమతించేవారు. ఈ ఉత్సవ సమయంలో కుస్తీపోతీలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. గెలిచినవారికి మంచి బహుమతులు ఇచ్చేవారు.
గోకులాష్టమి రోజు గోపాల్ కాలోత్సవము జరిపించేవారు. ఈదుల్ ఫితర్ పండుగరోజు మహామ్మదీయులతో మసీదులో నమాజు చేయిస్తూ ఉండేవారు. మొహర్రం పడుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్పి, కొన్ని రోజులు దానిని అక్కడ వుంచి తరువాత గ్రామంలో ఊరేగిస్తామనే వారు. నాలుగు రోజులవరకు మసీదులో తాబూతు ఉంచడానికి సమ్మతించి అయిదవ రోజు నిస్సంకోచముగా దాన్ని తామే తీసి వేసేవారు.
వారు మహామ్మదీయులంటే హిందువులలాగా చెవులు కుట్టి ఉండేవి. వారు హిందువులంటే సున్ తీ ని ప్రోత్సహించేవారు. బాబా హిందువైతే మసీదులో ఎందుకు ఉండేవారు. మహామ్మదీయుడైతే దునియను అగ్నిహోత్రము ఎలా వెలిగించి ఉండేవారు? అదేగాక, తిరగలితో విసరటం, శంఖము ఊదటం, గంట వాయించటం, హోమము చేయటం, భజన, అన్నసంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదాలతో పూజలు మొదలైన మహమ్మదీయ మతానికి అంగీకారం కాని విషయములు మసీదులో జరుగు తున్దేవి. వారు మహామ్మదీయులైతే కర్మిష్టులైన సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదాలపై సాష్టాంగ నమష్కారం ఎలా చేస్తూ ఉండేవారు.