లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం  

తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.

ఫలితం:

 లక్ష్మీ అంటేనే సంపద, ఆరోగ్యం, సంతానం, ధైర్యం, విద్య, జ్ఞానం, ఆనందం నిరంతరం మనతోనే ఉండే జీవన స్ధితి. ఈ స్ధితిని పొందాలంటే నిత్యం లక్ష్మీ దేవిని తలుచుకోవటం చేస్తుండాలి. కనీసం ప్రతి శుక్రవారం రోజు అయిన సరే పారాయణం చేసిన వ్యక్తికి సహజమైన శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడుతుంది. అంతేకాకుండా తాము తినబోయే ఆహార పదార్ధాలను భగవంతునికి నివేదిస్తూ లక్ష్మీ హృదయాన్ని పారాయణం చేస్తే ఆ ఆహారాన్ని తీసుకున్నవాడు లక్ష్మీప్రదుడు అవుతాడు.

అంతా చదవలేని స్దితిలో కేవలం  ఈ శ్లోకాన్ని తగినినా సరిపోతుంది.,   దుఃఖాన్ని, దారిద్రాన్ని హరించే, నీ పాదపద్మముల సన్నిధిని నాకు ప్రసాదించు. నా లోని ఆర్తిని, దీనత్వాన్ని తొలగించే నీ కృపాద్రుష్టిని నాపై వర్షింపచెయ్యి తల్లీ ! అని ఆమెను ఎవరైతే వేడుకుంటారో వారికి ఏ లోటు ఉండదు.