ఈ రోజులలో లక్ష్మీదేవిని ప్రార్థించి, ఆమె ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించని వారు కనపడరు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన స్తోత్రాలు, స్తుతులు శుక్రవారం రోజు పఠిస్తారు. ఆ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు.  షాపులు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవి పూజ చేయించుకుంటారు. కొన్ని బ్యాంక్ లు కూడా లక్ష్మి దేవిని ప్రార్దించి పనులు మొదలెడతాయి.

ఇప్పటి మానవులే కాదు, పురాణాలలో రాక్షసులు సైతం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేవారని అనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి.  కానీ లక్ష్మీదేవి చంచలం అని శాస్త్ర వచనం. కాబట్టి దీనికనుగుణంగా అమ్మను మన గృహాల్లో లక్ష్మీ దేవి స్దిర  నివాసం ఉండేలా చేయాలంటే ఏం చేయాలి..ఎలా  ఆరాధించాలి. అసలు ముందుగా ఆవిడ ఎటువంటి గృహాలని ని ఇష్టపడుతుందో చూద్దాం…

లక్ష్మీ దేవి స్దిర నివాసాలివి…
ఇంటిని, ఒంటిని, మనసును, పరిశుభ్రంగా ఉంచుకోవటం అందరికీ చేతనైన పనే. అయితే బద్ధకం వదిలించుకోవటం, నీతిని అనుసరించటం అనే వాటిని అలవాటు చేసుకుంటే చాలు లక్ష్మి అలాంటి వారిని వదిలి వెళ్లటమనేది జరగదు.  వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత ఇవి రెండూ ఉంటే సామాజికంగా అంతా సౌఖ్యప్రదమే, సౌభాగ్యదాయకమే అనే ఒక సందేశం లక్ష్మీదేవి మాటల్లో వినిపిస్తుంది. ఆ తల్లి సూచించిన ఉత్తమ స్థాయులకు ప్రతి మనిషి ఎదగగలిగేందుకు కృషి జరగాలి.  ఈ తీరుగా ముందుకు సాగితే ప్రతి ఇల్లూ లక్ష్మీదేవి నిలయమే అవుతుంది అని మన శాస్త్రకారులు చెప్తున్నారు.