అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.
వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పా౦డున౦దన!!
స్నానదాన జపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.
మాఘ పూర్ణిమ నాడు ” అలభ్య యోగం ” అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు.

ఈ రోజు హిందువులకు చాలా పవిత్రమైనది.  మాఘ మాసంలో వస్తుంది కాబట్టి, దీనిని మాఘ పూర్ణిమ అని పిలుస్తారు. మాఘ పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే వారు తేదీ, సమయాలు, ఆచారాలు, ప్రాముఖ్యత గురించి తెలుసుకుని ఆచరిస్తే ఫలితం ఘనంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు చూద్దాం.

ఈ రోజు విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి. ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం అని చెప్పబడింది.

తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిధే. ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.

హిందూ పురాణాల ప్రకారం, ఈ రోజున దేవతలు తమ స్వర్గపు నివాసం నుండి దిగి, పవిత్ర గంగానది ఒడ్డున కొంత సమయం గడుపుతారు.మాఘ పూర్ణిమ రోజున స్నానమాచరించి దానం చేయడానికి అనువైన సమయం తలస్నానం చేసిన తర్వాత మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ సమయంలో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి.   లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలన్నా లేదా శాశ్వతంగా ఉండాలన్నా..మాఘ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసి..తులసిచెట్టును పూజించాలి. సాయంత్రం దీపారాధన చేయాలి.