కృష్ణ శతకము శ్రీనృసింహకవి రాసిన శతకం. ఇందులో 102 కంద పద్యములు ఉన్నాయి. వీటిని కృష్ణ లీలలు, దశావతారములను వర్ణిస్తూ రాసాడు. ఇది ఇది శ్రీకృష్ణునికి అంకితమివ్వబదినది. ఈ శతకంలో ప్రతీ పద్యము అమృతంలా ఉంటుందని కృష్ణ భక్తుల ఉవాచ. ఆ విష్ణు మూర్తి నామస్మరణలో ఈ కృష్ణ శతకం మునిగి తేలుతుంది. తేనె చెవిలో పోస్తే ఎలా ఉంటుందో ఈ శకతంలో పద్యాలు వింటూంటే అలా ఉంటుందని చెప్తారు. మచ్చుకు ఓ పద్యము చూడండి.

హరియను రెండక్షరములు
హరియించును పాతకములు అంబుజనాభా
హరినీనామ మహత్యము
హరిహరి పొగడంగవశమె హరిశ్రీకృష్ణా
భావం:-
పద్మము నాభియందు గల ఓ విష్ణుమూర్తీ!
నీ హరి అను పేరు గల రెండు అక్షరములు,
మా పాపములను హరించుచున్నవి
నీ పేరులోని మహాత్మ్యమును పొగడుట మా తరమా
హరి అనే రెండు అక్షరాలు అన్నిపాతకాలూ పూర్తిగా కరిగించి మాయంచేస్తాయి.బొడ్డుయందు కలువగలవాడా(బ్యహ్మకుతండ్రి)కృష్ణా! హరి అనేనీపేరు యొక్క మహత్యాన్ని పొగడడం నాకుశక్యమా?
కృష్ణ శతక కర్త నృసింహ కవి. అతను దాదాపు సా.శ. 1760 ప్రాంతమువాడు. ఈ శతకం చాలా ప్రజాదరణ పొందినది. ఇది భక్తి రస ప్రధానమైనది. ఈ శతకంలో 102 కంద పద్యములలో కృష్ణలీలలు, దశావతారములను వర్ణించడం జరిగింది. సరళమైన భాషలో చిన్నపిల్లలలు కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది.