గత నాలుగు రోజుల పాటు అంగరంగ వైభంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ముగిసింది.  వనదేవతల తిరిగి వనప్రవేశం చేశారు. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర సాగింది. జన జాతరకు భక్తులు భారీగా తరలిరావటంతో మేడారం జన సంద్రమైంది. దారులన్నీ మేడారం వైపే అన్నట్లు.. తెలంగాణ వ్యాప్తంగా జనం తరలివెళ్ళారు. వన దేవతల మొక్కులు తీర్చుకునేందుకు, నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు, చీరె, సారెలు అమ్మలకు ఇచ్చేందుకు.. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

ఈ ఏడాది మేడారం జాతరలో ఇప్పటి వరకు కోటి30 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని మంత్రి ఇంద్ర కరణ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. జాతర సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆఫీసర్లకు, మీడియాకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.   తల్లులు గద్దెపైకి చేరడంతో ఎక్కువ మంది భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  

ఉన్నతాధికారుల ద‌గ్గర ఉండి ఏర్పాట్లను ప‌ర్యవేక్షించ‌డంతో వ‌న‌దేవ‌త‌ల జాత‌ర స‌జావుగా జ‌రిగింది. అధికారులు ముందు నుండి సూక్ష్మస్థాయిలో ప్రణాళికతో ముందుకు సాగడంతో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదు. అమ్మవార్ల దయతో భక్తులు మొక్కులు చెల్లించుకుని సంతోషంగా తిరిగి వెళ్లారు. అందరి సహకారంతో జాతర విజయవంతం అయ్యింది. జాతర ఏర్పాట్లు, నిర్వహ‌ణ‌ సంతృప్తికరంగా ఉన్నాయని పేరు వచ్చింది. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

మేడారం నైట్టైం కరెంట్ లైట్ల ధగధగలతో అత్యద్భుతంగా కనిపించిది. అక్కడక్కడా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లైటింగ్స్ కళ్లు జిగేల్మనేలా చేసాయి. వెన్నెల వెలుగులు వీటికి జత కలవడంతో జాతర మరింత అందంగా మారింది.