తెలంగాణ రాష్ట్రంలో కవులు, పండితులు, కళాకారులకు కొదవలేదు.  నిరంతరం  పారే సెలయేరులా, పాత నీరుపోతే వచ్చే  కొత్తనీరులా ఎందరో ఉన్నారు. వారు  తమ కలాలకు, కళలకు పనిచెప్పి  ప్రజల్లోకి వస్తున్నారు. జనం ఆదరిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. అలాంటి అరుదైన కళల్లో ‘సూక్ష్మ’విగ్రహాలు తయారీ కళ ఒకటి.
ఆవగింజ సైజు లో గణపతి, సూది బెజ్జం లో సాయిబాబా విగ్రహం, బుద్ధ విగ్రహం వినే ఉంటారు. వాటిని చెక్కిన జగిత్యాల కళాకారుడు గుర్రం దయాకర్ ఇప్పుడు మరో అద్బుతాన్ని ఆవిష్కరించారు.  మహా శివరాత్రి శుభ సందర్భంగా ఈ  ‘సూక్ష్మ’ కళాకారుడు గుండు పిన్నుపై శివలింగాన్ని రూపొందించాడు. గుర్రం దయాకర్ అనే సూక్ష్మ విగ్రహాల రూపకర్త గుండు పిన్నుపై సూక్ష్మ శివలింగం దానిపై పాము, ప్రకృతి అందాలను మంచుపర్వతాలను రూపొందించారు.

ఈ సూక్ష్మ విగ్రహాన్ని 8 గంటల పాటు ఎంతో శ్రమించి తీర్చిదిద్దినట్లు దయాకర్ తెలిపారు. దీన్ని తయారు చేసేందుకు నైలాన్‌తో పాటు కలర్స్ వాడినట్లు వెల్లడించారు. శివ లింగం సైజు 0.3 మిల్లీ మీటర్ ఉంటుందన్నారు. దయాకర్ ఎన్నో అద్భుతమైన సూక్ష్మ విగ్రహాలను ఇదివరకే తయారు చేసి పలు అవార్డులు కూడా పొందారు.. దయాకర్‌‌‌ను స్థానిక ప్రజా ప్రతినిధులు పలు సంఘాల నాయకులు, మిత్రులు అభినందించారు. ఇక ఇప్పటికే దయా కర్‌ అతి సూక్ష్మ విగ్రహాలు తయారు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ తెలుగు, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాఘవ పట్నం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గాలిపల్లి చోళేశ్వర్‌ పెన్సిల్‌పై నా లుగు స్తంభాల సూక్ష్మ శివాలయ విగ్రహాన్ని మలిచాడు. శివాలయం నాలుగు స్తంభా ల శిఖరం కలిగి ఉండి 0.03 సెంటిమీటర్ల ఎత్తులో బియ్యపు గింజలు సగం పరి మాణంలో వేము లవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని పోలిఉండే విధంగా మలిచాడు. అం తకంటే చిన్న పరిమాణంలో 0.01 సెంటిమీటర్ల ఎత్తులో శివలింగాన్ని చెక్కాడు. ఇం దుకు గంటా 30నిమిషాల సమయం పట్టిందని చోళేశ్వర్‌ తెలిపారు.