శనీశ్వరుడు పేరు తలవందే జీవితం గడవదు అని ఆర్యోక్తి. అవును…జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని గ్రహాల న్యాయాదీశునిగా పరిగణిస్తారు. అంతేకాకుండా క్రూరమైన గ్రహం భావిస్తారు. ఇది మానవులు చేసే మంచి, చెడులను శిక్షిస్తుంది. ఈ నేపథ్యంలో శని మహాదశ ఎంతో ప్రభావంతంగా పరిగణిస్తారు. జాతకుడిపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. కెరీర్, డబ్బు, వైవాహిక జీవితం శని స్థితి ఆధారపడి ఉంటాయి. అందుకే శని మహర్దశలో జీవిత పరిణామాలు కూడా మారుతుంటాయి. ఇంత శక్తివంతుడైన శనీశ్వరుడి అనుగ్రహం సంపాదించాలంటే ఏం చేయాలి..ఓ మూల మంత్రం ఉంది…అందుకు ఓ పురాణ కథ కూడా ఉంది.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ

కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ

శుద్ధబుద్ధి ప్రదాయనే

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్

మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదని చెప్తారు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటంటే….నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

 శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ”క్రోడం నీలాంజన ప్రఖ్యం..” అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.

ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుందని చెప్పబడింది . ఇలా చేసిన వాళ్లు  ప్రతిదాంట్లోనూ విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆధ్యాత్మికత, మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవితంలో అద్భుత విజయాలు సాధిస్తారు.