సాయి బాబా బోధనలు హిందూ మతం మరియు ఇస్లాం యొక్క రెండు అంశాలను మిళితం చేశాయి.  ప్రేమ, సహనం, సంతృప్తి, దాతృత్వం మరియు అంతర్గత శాంతి నియమావళిని బోధించాయి. ఆయన బోధలలలో  ‘సబ్కా మాలిక్ ఏక్ హై’ అనేది అత్యంత ప్రాచుర్యమైనది. కలియుగంలో సద్గురు అవతారంలో నేటికీ సమస్త జనులకూ హితం కలిగిస్తూ ఉంటారు. పదహారేళ్ళ వయస్సులో షిర్డీలోని వేపచెట్టు కింద కూర్చుని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాంద్ భాయీ పాటిల్ తో పెళ్ళి ఊరేగింపులో వచ్చి షిర్డీలో కనిపించారు. అప్పటినుంచి చివరి శ్వాస దాకా షిర్డీలోనే ఉన్నారు. దాదాపు అరవై ఏళ్ళు సాయిబాబా అక్కడ నివసించారు. తన జన్మము గురించి చివరిదాకా ఎవరికీ ఏమీ చెప్పలేదు.

షిర్డీలో భక్తులు స్థానికుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి తగిన సలహాలిస్తూండే వారు. అప్పుడప్పుడు కొన్ని వింతలు, విచిత్రాలు చేసేవారు. అవి చూసిన జనం బాబా మహిమను గుర్తించక తప్పలేదు. శ్రీసాయిబాబా సాధారణ వ్యక్తికాదని, మానవాతీత దివ్యశక్తి అని గ్రహించారు. నేటికీ బాబాను దర్శించాటానికి లక్షలాదిగా భక్తులు షిర్డీకి వెళ్తుంటారు. వారి కోరికలూ తీరుతుంటాయి.

శ్రీ షిరిడీసాయిబాబావారి ఊదీ ఎంతో పవిత్రమయినది. సాయిబాబా దేవాలయాలలో ఏర్పాటు చేసిన ధునిలో కట్టెలను కాల్చగా వచ్చిన భస్మమే ఊదీ. సాయి దేవాలయాలలో ఆయన సమక్షంలో ధునిలోనించి వచ్చినది కాబట్టే దానికంత పవిత్రత. అది ఎంతో శక్తివంతమయినది. రోగాలను కూడా నయం చేయగలిగినటువంటి శక్తివంతమైనది. శ్రీషిరిడీ సాయిబాబావారు ఊదీతో ఎన్నో వ్యాధులను నయం చేశారు. సాయిబాబా మందిరాలన్నిటిలో ఊదీని ప్రసాదంగా భక్తులందరికీ పంచుతున్నారు. ఊదీని మనం నుదిటికి రాసుకొన్నపుడు శిరోభారం తగ్గటమె కాక శిరస్సుకు సంబంధించిన సమస్యలన్నీ నివారణవుతాయి.

బాబాను మనస్ఫూర్తిగా నమ్మి ఉదీలో ఆయన అనుగ్రహపు జల్లులను కురిపించమని ప్రార్ధన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. సాయిబాబా ఊదీతో ఎంతోమందికి ప్రమాదకరమయిన రోగాలనెన్నిటినో నివారణ గావించారు.

బాబాని పూర్తిగా నమ్మితే అతిప్రమాదకరమయిన జబ్బులు కూడా ఊదీతో నయమవుతాయి. నిజంగానే కనక బాబా మీద నమ్మకంతో శరీరం మీద బాధ ఉన్న ప్రదేశంలోకాని, రోగగ్రస్తమయిన ప్రదేశంపై గాని ఊదీని రాసుకుంటే దాని ప్రభావంతో నివారణవుతుంది.