త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ  త్రియాయుధమ్
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్

అంటూ.. మూడు జన్మల పాపాలను హరించడానికి మూడు దళాలు గల బిల్వపత్రాన్ని ఒక్కటే అయినా.. త్రినేత్రునికి సమర్పించాలని అంటారు.

శివుడు.. సర్వమంగళ స్వరూపుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ జగత్తులో ఏదీ జరుగదు. హిందువులకు  శివ పూజ ఎంతో ప్రాముఖ్యమైనది. తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోళా శంకరుడు ఈ పరమేశ్వరుడు. ఆ మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు.  అలాగే శివ పూజలో బిల్వ పత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. బిల్వ పత్రం, మారేడు పత్రం అనగానే ముందుగా శివుడే గుర్తొస్తాడు. ఈ ఆకులేనిదే శివపూజ పూర్తి కాదు.. అందుకే ప్రతి శివాలయంలో నూ ఈ చెట్టు ఉంటుంది. ఏమిటి అంత ప్రాముఖ్యత?

సృష్టి స్థితి లయలనే మూడు క్రియలు వేర్వేరుగా ఉండేవి కాదు.. వీటి మధ్య భేదం లేదు. ఈ మూడూ కూడా ఒక్కటే అనే అభేద భావాన్ని గుర్తు చేసేది బిల్వపత్రం.. మారేడు ఆకు. శివుడికి మారేడు అంటే ఎంతో ఇష్టము.  బిల్వపత్రంలో ఆకులు మూడుగా ఉన్నప్పటికీ.. వాటిని జతపరిచి ఉండే కాండం ఒక్కటే! అదే అభేదభావం అని పురాణాలు చెబుతాయి. పరమశివునికి బిల్వపత్రంతో ప్రత్యేకంగా పూజ చేయడానికి కూడా ఇదే కారణంగా చెప్తుంటారు.

పూజకుడు- పూజ్యము- పూజ ఈ మూడూ ఒక్కటే అనేది బిల్వపత్రం అందించే సందేశంగా మన పురాణాలు చెప్తున్నాయి. పూజకుడు అంటే పూజ చేసేవాడు. పూజ్యము అంటే ఎవరిని పూజిస్తున్నామో వారు. పూజ అనేది చేస్తున్న పని. అంటే చేస్తున్న పని.. దానిని చేస్తున్న వ్యక్తి, ఫలితాన్ని పొందుతున్న వ్యక్తి ఈ మూడూ వేర్వేరుగా మనకు కనిపిస్తాయి. కానీ.. లోతుగా గమనిస్తే ఈ మూడూ కూడా ఒక్కటే. వీటి మధ్య భేదం లేదు. అందుకే మూడు పత్రాలుగా కనిపించినా.. ఒకటే కాడతో ముడిపడి ఉండే బిల్వపత్రం మారేడు ఆకు.. త్రినేత్రుడైన పరమశివునికి ప్రీతికరమైనదని మన పురాణాలు చెబుతున్నాయి.

భక్తులు కూడా ఈ చెట్టును అంతే శ్రద్ధగా పూజిస్తారు. అయితే, ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. వీటిని నేరుగా తీసుకున్నా, కషాయం చేసి తాగినా అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు ఆ ప్రయోజనాలో ఇప్పుడు చూద్దాం..

  మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. తెల్ల లేదా ఎర్రగన్నేరు, తుమ్మి పూలు , మోదుగ పూలు, తెల్లజిల్లేడు పూలు శ్రేష్టమైనవి. తరువాత శివఅష్టోత్తరం చదువుతూ సాయంత్రం వరకు ఉపవాసము ఉండి శివాలయానికి వెళ్లి లేదా ఇంట్లోనైనా శివుడి దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి . సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు.