భారతదేశంలో చాలా  అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఇవి యాత్రికులుకు, సందర్శకులకు నిజ జీవిత సమస్యలను తీరుస్తూంటాయి. ఎన్నో నమ్మకాలను కూడిన వరాలను అందచేస్తూంటాయి.  అలాంటి మహిమాన్విత దేవాలయాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న సిమ్సా మాత మందిర్.  సంతానం కోరుకునే స్త్రీలు తమ కోరికలు తీర్చుకుంటారని ప్రసిద్ది.


ఇజి ఒక విశిష్టమైన దేవాలయం.  హిమాచల్ ప్రదేశ్ ..బైజ్‌నాథ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిమ్సా అనే గ్రామంలో ఉన్న ఈ మందిరం శారదా దేవికి అంకితం చేయబడింది. కాంగ్రా మరియు మండి జిల్లాలతో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి సిమ్సా మాత మందిరాన్ని సందర్శించారు.

ప్రతి సంవత్సరం, నవరాత్రి సమయంలో, అనేక మంది యాత్రికులు ఇక్కడకి వస్తూంటారు. ఆ సమయంలో  ఈ మాత మందిరంలో సలిందర అనే ఉత్సవం నిర్వహిస్తారు. స్థానిక భాషలో సలిందర అంటే ఒక కల. మాతా సింమ్సా మందిరం నేలపై నిద్రించడం ద్వారా, స్త్రీకి కలలో పండు లేదా కూరగాయలు కనిపిస్తే, సంతానం కలుగుతుందని నమ్ముతారు.
అటువంటప్పుడు, స్త్రీ ఆలస్యం చేయకుండా ఆలయం నుండి బయలుదేరవలసి ఉంటుంది. లేకుంటే, కొన్ని వింత జరిగి. తద్వారా ఆమె శరీరంపై దద్దుర్లు వస్తాయి.

ఇక ఈ దేవాలయ ప్రాంగణంలో నిద్రించే స్త్రీకు కలలో బెండకాయ కనిపిస్తే అమ్మాయి, జామకాయ కనిపిస్తే అబ్బాయి పుడతారని చాలామంది భావిస్తారు. స్త్రీకి కల వచ్చిన వెంటనే ఆమె ఆలయం నుంచి వెళ్లిపోవాలి. సిస్సా దేవాలయానికి సమీపంలో ఒక పెద్ద రాయి ఉంది. ఈ రాయికి ఒక విచిత్రమైన ప్రత్యేకత ఉంది. పెద్దవాళ్లు కదిలిస్తే కదలని ఈ రాయి పిల్లలు కదిలిస్తే మాత్రం కదులుతుంది.

స్త్రీలకు కలలో చెక్క లేదా మెటల్ కనిపించినా పిల్లలు పుడతారని చాలామంది బలంగా నమ్ముతారు. ఇప్పటివరకు పిల్లలు పుట్టని దంపతులు ఉంటే ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చు. రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా చేరుకునే అవకాశం అయితే ఉంది.