భగవత్ ఆరాధనా సమయంలో పువ్వలకు ఒక ప్రత్యేక స్థానం వుంది.  పూజ పూర్తయ్యాక భక్తిపూర్వకంగా అయ్యవారు…అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను అర్చక స్వామి తీసుకుని బయిటకు వస్తారు. వాటిని భక్తులు తీసుకుని కళ్లకు అద్దుకుంటారు. అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు.. అలాంటి వాటిలో సంపెంగ ఒకటి.  శ్రీ శివ మహాపురాణము లో సంపెంగ ను ఎందుకు వాడరో ఓ కథ ఉంది. సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లో సమర్పించరాదు. శివుడికి వాటికి శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూవులను అడుగుతాడు. దీంతో.. బ్రహ్మను , సంపంగి ఇద్దరినీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. అదేమిటో చూద్దాం.

 ఒకానొక కాలంలో ఒక దుర్మార్గుడు ఉండేవాడు. అయినా అతను నిత్య శివపూజాలో గడిపేవాడు. ప్రతి రోజూ సంపెంగలచేత శివుని పూజించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడైనవాడు.  ఆ దేశపు చక్రవర్తినే శాసించగల స్థితికి చేరుకున్నవాడు. చక్రవర్తి అంతటి వాడిని, పాదాక్రాంతుడిగా చేసుకున్న గర్వంతో అతడు ప్రజలను పీడించసాగాడు. కానీ, అతడిపై ఫిర్యాదు చేసినా రాజు పట్టించు కొనేవాడుకాదు.

Image Courtesy : Wikipedia

 ఇలా రోజులు గడుస్తూ ఉండగా -ఆ దుర్మార్గుడు ప్రతిరోజు తన అర్చన (సంపెంగపూలతో) మానివేయకుండా జాగ్రత్త పడుతూవచ్చాడు. ఆ కారణాన అంతులేని శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు. నారదుడు ఓసారి భూలోక సంచారార్థం వచ్చినప్పుడు ఈ వైనం అంతా చూశాడు. కానీ ఆయనకు మొదట్లో ఈ దుష్ఠుని విషయం ఏమిటో అర్దం కాలేదు. అతడెటువంటివాడని అడగ్గా, సంపంగి బదులివ్వలేదు. కేవలం ఆ దుష్టబుద్ధి అకృత్యాలకు భయపడి సంపంగి మారుపల్కలేదు.

 అయినా దేవర్షి అంతటివాడు అడిగినప్పుడు  నిజం  చెప్పాలి కదా! దుష్టుని బెదిరింపు వల్ల చెప్పలేకపోవచ్చు! నారదుడు తరచి తరచి ప్రశ్నించినా తనకేమీ తెలియదంది సంపంగి. అసత్యదోషానికి పాల్పడినందువల్ల ‘నేటినుంచీ నీ పూలు శివపూజార్హత కోల్పోవుగాక!’ అని శపించాడు నారదుడు.  అంతవరకు శివప్రీతికరమైన సంపెంగకు శివపాద సన్నిధి చేరే అవకాశం నశించిందని చెప్తారు.