‘గజాననాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి’

మనలో చాలా మందికి ఏ పని చేయాలన్నా విఘ్నాలు అంటే అడ్డంకులు  వస్తుంటాయి. అటువంటి వారు దూర్వార పత్రంతో వినాయకుడు పూజ చేస్తే అడ్డంకులు అన్ని అరక్షణంలో మాయమైపోతాయి. ఇంతకీ దూర్వార పత్రం అంటే…

దూర్వా అనగా గరిక, ఇది శ్వేత దూర్వా నీల దూర్వా మరియు గండదూర్వా అని మూడు రకములు. గండ దూర్వాకు గండాలి అని పేరు. శ్వేత దూర్వా (తెల్లగరిక)కు సంస్కృతంలో శతవీర్యా అని, నీల దూర్వా (నల్ల గరిక)కు బుర్రం, సహస్రవీర్యా అని పేర్లు. దూర్వా మరియు నీల దూర్వాలకు వైద్య శాస్త్రంలో దూర్వాద్వయం అని పేరు. దూర్వాయుగ్మం అనగా రెండు దళములు కలిగిన దూర్వా గండదూర్వను లతాదూర్వా అని కూడ అంటారు.

దీని వేరు భూమి పైన తీగమాదిరి పెరిగి ఆ లతపైన దూర్వలు మొలుస్తాయి. ఇవి గడ్డిజాతికి చెందిన మొక్కలు. వినాయక పూజ యందు దూర్వాకు విశేష ప్రాధాన్యత ఉంది. గణపతి అధర్వ శీర్షమునందు “యో దూర్వాంకురరై రజతి సవైశ్రవననోపమో భవతి” అని దూర్వాహోమము ప్రాశస్త్యము చెప్పబడినది.

ఇక గణపతి పూజలో గరిక తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. గరికతో పాటు గన్నేరు పూలతో బుధవారం రోజున వినాయకుడికి పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే దూర్వార పత్రంతో గణేశుడికి పూజ చేస్తే శనిదోషాలు పోతాయి.  అందుకే  గణేశ పూజ చేస్తే సకల పాపాలు తొలగి గణపతి అనుగ్రహం కలుగుతుందంటూ పండితులు చెబుతున్నారు.
అలాగే చేపట్టే పనులు విజయవంతం కాకపోతే బుధవారం రోజు వినాయకుడికి పూజలు చేయాలి. ఈ  రోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి ఆయన్ను దర్శించుకోవాలి.

దుర్గాసూక్తమున- సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా సర్వగ్ం హరతుమే పాపం దూర్వా దుస్స్వప్ననాశినీ అని చెప్పబడింది.

శ్రీ ఆదిశంకర విరచిత చతుష్టష్టి పూజ యందు కూడా దూర్వాకు ప్రాధాన్యత కలదు.

బుధవారం రోజు ఆవులకు గడ్డి తినిపించడం లేదా ఆకుపచ్చని కూరగాయలను తినిపించడం చేయాలి. గణపతి అనుగ్రహం సంపాదించుకోవాలి.