శని పట్టేసిందిరా అని కాస్త కష్టం రాగానే అనేస్తాం. అంత లోకువ మనకు శనీశ్వరుడు. మనలో చాలా మందికి శని అనగానే భక్తి కన్నా భయం ఎక్కువ కలుగుతుంది.అయితే ఆయనకు ఇష్టం ఉండదట. శని పట్టేసిందిరా అనగానే ఆయనకు చాలా కోపం వస్తుందిట.  శనీశ్వరుడిని మాటిమాటికి శని, శని అని పిలవకూడదు.శని దేవుడిని తలచటం వల్లనే  అనేక ఇబ్బందులు కలుగుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ వాస్తవానికి అది ఏమాత్రం నిజం కాదు.నవగ్రహాలలో శనిగ్రహం ఒక్కటి. ఆయన శక్తి మంతుడు.

శనివారం శని దేవుని భక్తి శ్రద్ధలతో పూజించిడం వల్ల ఆయన అనుగ్రహం కలిగి, ఏళ్లతరబడి ఉన్న కష్ట,నష్టాలు  పోగొట్టుకోవచ్చు. శనివారం శని దేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సిరి, సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శనివారం నాడు మనకు శనీశ్వరుని దేవాలయం అందుబాటులో లేకపోతే, నవగ్రహాలకు వెళ్లి అక్కడ ఉండే శనీశ్వరుని దర్శించుకోవాలి.

అలా వెళ్లేటప్పుడు మీకు అవకాసం ఉంటే  నల్లటి నువ్వులను తీసుకొని, నవగ్రహాలలోని శని పాదాల ముందర వాటిని సమర్పించండి.  అలాగే నువ్వుల నూనెతో శనీశ్వరునికి తలనుండి పాదాల వరకూ వచ్చేలా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి.ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు అనుభవంలోకి వచ్చాక ఆశ్చర్యపోతారు. ఆయన అనుగ్రహంతో  ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

అలాగే నల్లటి వస్త్రమును తీసుకొని శనీశ్వరుని మెడలో మాలగా ధరించండి.శనీశ్వరుని పూజ చేసేటప్పుడు ముదురు నీలం రంగు దుస్తులు లేదా నలుపు రంగు దుస్తులు ధరించండి. శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. శనివారం రోజున రావిచెట్టుకు, మీరు పాలతో కలిపిన చక్కెరను పోసి, దీపం వెలిగించడం ద్వారా శనీశ్వరుని దయ.ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.