సూర్యుడు సంచార సమయంలో మానవ జీవితంపై అత్యంత గణనీయమైన మార్పలు జరుగుతాయి.  సూర్యుని యొక్క కదలికను మరియు అన్ని రాశిచక్రాల యొక్క స్థానికుల జీవితాలపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. సూర్యుడు  యొక్క బలమైన స్థానం లేకుండా, వృత్తి మరియు అధికారం పరంగా అతని / ఆమె జీవితంలో శీఘ్ర ఫలితాలను పొందలేరని మనకు జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటే, అప్పుడు అతను/ఆమె జీవితంలో సక్సెస్ ను సృష్టించేందుకు అవకాసం ఉంటుంది.

అలాగే  సూర్యుడి రథానికి ఒకే అశ్వం ఉంటుంది .. దానిపేరు ‘సప్త’. ఒకే చక్రం ఉంటుంది .. అదే కాలచక్రం. సూర్యభగవానుడు 12 మాసాలలో ఒక్కో మాసంలో ఒక్కో పేరుతో 12 రాశులలో సంచరిస్తూ ఉంటాడు. చైత్రంలో ‘ధాత’ .. వైశాఖంలో ‘అర్యముడు’ .. జ్యేష్టంలో ‘మిత్రుడు’ .. ఆషాఢంలో ‘వరుణుడు’ .. శ్రావణంలో ‘ఇంద్రుడు’ .. భాద్రపదంలో ‘వివస్వంతుడు’ .. ఆశ్వయుజంలో ‘త్వష్టా’ .. ‘కార్తీకంలో ‘విష్ణువు’ .. మార్గశిరంలో ‘అంశుమంతుడు’ .. పుష్యంలో ‘భగుడు’ .. మాఘంలో ‘పూషా’ .. ఫాల్గుణంలో ‘పర్జన్యుడు’ పేరుతో సంచరిస్తుంటాడు.    

Image Courtesy : Wikipedia

సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యారాధన అనాదిగా ఉన్నదే. ఒక్కొక్క దేవునిక ఒక్కో రోజు ప్రతీకరం. ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు. సూర్యుడు నవగ్రహాధిపతి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాల్లో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్రలేవగానే సూర్యుడి నమస్కారం చేయ డం, సంధ్యావందనం వంటి వాటి ద్వారా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంహిందూ సంప్రదాయంలో ఉంది. సూర్యుని రథానికి ఏడు గుర్రాలని, అవి ఏడు రంగుల ఇంద్రధనస్సుని సూచిస్తాయని అంటుంటారు.

  సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించడమనేది అనాది కాలం నుంచి వుంది.  సూర్యుడికి శివుడు ఆరాధ్యదైవం కనుక ఆదివారం నాడు శివునికి నూనె దీపాన్ని వెలిగించండి.
“ఓం భాస్కర్యాయ నమః” అని ప్రతిరోజూ 19 సార్లు జపించండి.
ఆదివారాలు ఉపవాసం పాటించండి.
ఆదివారం పేద ప్రజలకు ఆహారం అందించండి.