సూర్యుడు.. సాక్షాత్తు ప్రత్యక్ష్య దైవంగా తరతరాలుగా భావించి  ఆరాధిస్తున్నాము. అనాదిగా సూర్యారాధనకు విశేషమైన ఆదరణ ఉంది.మన  పూర్వీకులు సూర్యుడిని ఆరాధించి అనేక ప్రయోజనాలు పొందారు. ఈ కాలంలోనూ సూర్యారాధనకు ప్రత్యేకమైన స్దానం ఉంది. సైన్స్ సైతం సూర్యుడు వలన వచ్చే ప్రయోజనాలను ఆమోదించింది.  ప్రస్తుతం ఈ కాలంలో ఆరోగ్యం కోసం పలు హాప్సటల్స్ కు వెళ్తుంటారు. కానీ నిజానికి ఆరోగ్యం కోసం పూర్వీకులు చెప్పిన విధానాలు పాటిస్తే తప్పక ఆరోగ్యం లభిస్తుంది. పలువురు ఈ విషయాన్ని నిరూపించారు కూడా. ఎందుకంటే సూర్యుడు ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రపంచానికి ఆత్మగా భావించే సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం ఉత్తమమైన రోజు. సూర్య భగవానుని ఆశీర్వాదాలు, ప్రయోజనాలను పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

సాంబ సూర్యస్తుతి :
‘‘ భాస్కరో భగవాన్ సూర్యః చిత్రభానుర్విభావసుహు
యమః సహస్రాంశుమాలీయమునా ప్రీతిదాయకః
దివాకరో జగన్నాధః సప్తాశ్వస్య ప్రభాకరః
లోక చక్షుః స్వయంభూశ్చ ఛాయారతి ప్రదాయకః
తిమిరారిర్దినధవో లోకత్రయ ప్రకాశకః
భక్తబంధుః దయాసింధుః కర్మసాక్షీ పరాత్పరః
ఏకవింశతి నామాని, యః పఠేదుదితే మయి
తస్య శాంతిం ప్రయచ్ఛామి సత్యం సత్యం వదామ్యహమ్’’

ఈ సూర్యారాధనతో  ఆయువు, ఆరోగ్యం పెరుగుతాయి. శుచితో భక్తితో సూర్యోదయం సమయంలో ఈ ఆరాధన చేయాలి. కనీసం 40 రోజులు చేస్తే మీకు మంచి ఫలితాలు కన్పిస్తాయి.

శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు కుష్టు రోగగ్రస్తుడైనపుడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం సాంబుడు సూర్యోపసన చేసాడు. అత్యంత ప్రభావవంతమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే సూర్యోదయ సమయంలో పఠిస్తారో వారికి తప్పక ఆయుః, ఆరోగ్యం కలుగుతాయి.