‘అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే’

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ప్రధానమైనది. ఆశ్వీయుజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. ఆ తర్వాత విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.

ద‌సరా అంటే.. ద‌స్‌+హ‌రా.. అని అర్థం వ‌స్తుంది. అంటే.. హిందీలో ద‌స్ అంటే తెలుగులో ప‌ది (10) అని అర్థం వ‌స్తుంది. అంటే.. 10 త‌ల‌ల రావ‌ణాసురున్ని రాముడు హ‌త‌మార్చిన సంద‌ర్భం అన్న‌మాట‌. అందుక‌నే దాన్ని ద‌శ‌హ‌రా.. అని మొద‌ట్లో వ్య‌వ‌హ‌రించేవారు. ద‌శ‌కంఠుడు అన్నా రావ‌ణాసురుడ‌నే అర్థం వ‌స్తుంది. అందుక‌నే మొద‌ట్లో ద‌శ‌హ‌రా అని విజ‌య‌ద‌శ‌మిని వ్య‌వ‌హ‌రించేవారు. అది రాను రాను ద‌స‌రాగా మారింది. ద‌స‌రా అని విజ‌య‌ద‌శ‌మికి పేరు రావ‌డానికి గ‌ల కార‌ణం కూడా అదే.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.

శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.

ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆనవాయితి. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.