ప్రముఖ ఆధ్యాత్మక వేత్త,  అవ‌ధాని గ‌రికపాటి న‌ర‌సింహారావుకు పద్మ పుర‌స్కారం ల‌భించింది.  రిపబ్లిక్ డే సందర్భంగా భార‌త ప్ర‌భుత్వం అత్యున్న‌త అవార్డు ప‌ద్మ‌శ్రీ‌కి ఆయనను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.  ఈ విషయమై గరికిపాటి నరసింహారావు గారు తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ… పద్మ పురస్కారానికి తాను దరఖాస్తు చేసుకోకపోయినా.. తెలుగు రాష్ట్రాల కృషి అభినందనీయమని  పేర్కొన్నారు.
తన ప్రవచనాలు కొంత మంది యువతలో, సమాజంలో మార్పులు తీసుకొస్తే అంతే చాలని ఆయన పేర్కొన్నారు. అలాగే తాను ఎవరి సత్కారాల ప్రవచనాలు, ప్రసంగాలు చేయడం లేదని స్పష్టం చేశారు గరికిపాటి నరసింహారావు. తన ప్రవచనాలతో కొంతమంది నొచ్చుకుని  ఉండొచ్చన్నారు. అయితే ఎవరిని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని వివరించారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్ల తన పని తాను సక్రమంగా చేసుకుంటూ పోతే.. అన్ని యోగ్యతలు కలుగుతాయనన్నారు. సమాజంలో ప్రవచనకర్తలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు గరికిపాటి నరసింహారావు.

 గ‌రిక‌పాటి అవ‌ధాని మాత్ర‌మే కాదు మంచి ర‌చ‌యిత‌, అద్భుత‌మైన వ‌క్త‌. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌, విదేశాల‌లో సైతం అవ‌ధానాలు నిర్వ‌హించారు. మ‌హా స‌హ‌స్రావ‌ధానం నిర్వహించ‌డంలో దిట్ట‌. ప‌లు ప్ర‌సార మాధ్య‌మాల‌లో నిత్యం బోధ‌న‌లు చేస్తూ అల‌రిస్తూ వ‌స్తున్నారు గ‌రిక‌పాటి. ప‌లు సాహిత్య‌, ఆధ్యాత్మిక అంశాల‌పై ప్రసంగించారు.