అత్యంత శక్తిమంతుడు, బలశాలి, అంజనీపుత్రుడు హనుమాన్ అనుగ్రహం దొరకటం అంటే మాటలు కాదు. హనుమంతుడి అండ (Hanuman blessings) ఉంటే.. కొండంత అండ ఉన్నట్టే . అందుకే ఆ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన భక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రతీ దానికి ఓ విధి విధానం ఉంటుంది. అలాగే ఈ అంజనీపుత్రుడు అండ అందుకోవటానికి ఓ పద్దతి ఉంది. అవేమిటో చూద్దాం.
మనకు అందరికి తెలుసు ఆ శ్రీ రాముడు అంటే హనుమంతుడుకి ఎంత భక్తో…అందుకే రాములవారిని కొలిచేవారికి హనుమంతుడు చేరువ అవుతాడు. శ్రీరాముడుని భక్తితో తనని కొలిచే వారి ఇంట సుఖ శాంతులు, సంతోషాలకు కొదువ లేకుండా చూస్తాడు.
అనుకోని ఇబ్బందులు…అవాంతరాల నుంచి గట్టెక్కించేందుకు అంజనీ పుత్రుడున్నాడు అని నమ్మాలి. ఆయన నామస్మరణ చేస్తూ …మంగళవారం పూట ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి సింధూరం తీసుకుని.. ముఖానికి, చేతులకు, హృదయం మీద లేపనం చేసుకోండి. ఇలా చేశాక..
”ఓం అంజనీ సుతాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి
తన్నో మారుతి ప్రచోదయాత్” అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అప్పుడు జరిగే మ్యాజిక్ చూడండి. ఇలా చేస్తే ముందుగా అనుకోని అవాంతరాలు, సమస్యలు ప్రక్కకు వెళ్లిపోతాయి.
ఇక మీరు దూరపు ప్రయాణాలు చేస్తే.. యాత్రలకు వెళ్లాలనుకున్నప్పుడు, మధ్యలో ప్రమాదాల ఎదురుకాకుండా ఉండాలంటే..స్వామి వారి ఎదుట కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు తల మీద చల్లుకుని కొబ్బరిని ప్రసాదంగా పంచి.. వారూ కొబ్బరి తినాలి. ఇలా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అలాగే స్వామివారి ఎదురుగా నిలబడి ..ఓ నమస్కారం పెట్టుకుని ఓ ఎర్రని వస్త్రంలో ఎనిమిది ఖర్జూర కాయలను వుంచి మూట కట్టి కొత్త వాహనానికి ఆ వస్త్రాన్ని కట్టడం ద్వారా వాహనపరంగా ఎలాంటి ప్రమాదాలు రాకుండా నివారించవచ్చునని మన పెద్దలు చెప్తున్నారు.
జై వీర హనుమాన్…భజరంగభళి