శ్రీ మాత్రే నమః

సనాతన ధర్మం ఆశ్వీయుజమాసాన్ని శక్తి ఆరాధనకు కీలకంగా పేర్కొంది. శక్తి అంటే లక్ష్మీ, పార్వతీ, కాళీ, సరస్వతి.. ఇలా ఏ పేరున పిల్చినా పలికే అమ్మ..

శ్రీ లలితా సహస్రనామంలో పేర్కొన్నట్లు అమ్మ.. శ్రీమాతా, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరీ.

అంటే సృష్టి, స్థితి, లయకారిణి ఆమ్మే. త్రిమూర్తులకు.. దశావతారాలకు అన్నింటికి మూలం అమ్మే. ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి.

26-09-2022 సోమవారము
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి
శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి

అలంకరణ: బంగారు రంగు చీర
నైవేద్యం: కట్టుపొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం.

27-09-2022 మంగళవారము
ఆశ్వీయుజ శుద్ధ విదియ
శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి

అలంకరణ: లేత గులాబీ రంగు చీర
నైవేద్యం: పులిహోర

28-09-2022 బుధవారము
ఆశ్వీయుజ శుద్ధ తదియ
శ్రీ గాయత్రీ దేవి

అలంకరణ: కాషాయం/నారింజ రంగు చీర
నైవేద్యం: కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం.

29-09-2022 గురువారము
ఆశ్వీయుజ శుద్ధ చవితి
శ్రీ అన్నపూర్ణా దేవి

అలంకరణ: గంధం/పసుపు రంగు చీర
నైవేద్యం: దధ్యోజనం, క్షీరాన్నం, అల్లం గారెలు

30-09-2022 శుక్రవారము
ఆశ్వీయుజ శుద్ధ పంచమి
శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి

అలంకరణ: కుంకుమ/ఎరుపు రంగు చీర
నైవేద్యం: దధ్యోజనం, క్షీరాన్నము

01-10-2022 శనివారము
ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి
శ్రీ మహాలక్ష్మీ దేవి

అలంకరణ: గులాబీ రంగు చీర
నైవేద్యం: చక్కెర పొంగలి, క్షీరాన్నము

02-10-2022 ఆదివారము
ఆశ్వీయుజ శుద్ధ సప్తమి
శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం)

అలంకరణ: తెలుపు రంగు చీర
నైవేద్యం: దధ్యోజనం, కేసరి, పరవాన్నం

03-10-2022 సోమవారము
ఆశ్వీయుజ శుద్ధ అష్టమి
శ్రీ దుర్గా దేవి (దుర్గాష్టమి)

అలంకరణ: ఎరుపు రంగు చీర
నైవేద్యం: కదంబం, శాకాన్నం

04-10-2022 మంగళవారము
ఆశ్వీయుజ శుద్ధ నవమి
శ్రీ మహిషాసురమర్ధనీ దేవి (మహర్నవమి)

అలంకరణ: ముదురు ఎరుపు రంగు చీర
నైవేద్యం: చక్కెర పొంగలి

05-10-2022 బుధవారము
ఆశ్వీయుజ శుధ్ధ దశమి
శ్రీ రాజరాజేశ్వరీ దేవి (విజయ దశమి)

అలంకరణ: ఆకుపచ్చ రంగు చీర
నైవేద్యం: లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం.

శ్రీ మాత్రేనమః

(విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమును అనుసరించి…)