వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి రోజున ప్రతి ఏడాది అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.   ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం ఎంతో మంచిదని మన వాళ్ల నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు అక్షయ తృతీయ రోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మనం ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే అక్షయ తృతీయ రోజు ఈ దానాలు చేయడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి అక్షయ తృతీయ రోజు ఏ రాసి వారు  ఏ దానాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

Image Courtesy : Wikipedia

మేష రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు ఎరుపు రంగు వస్త్రం, లడ్డూలను దానం చేయాలి.

వృషభం: వృషభ రాశి వారు అక్షయతృతీయ రోజు నీటితో నిండిన కలశం దానం చేయాలి.

మిథునం: ఈ రాశివారు చంద్రుడి అనుగ్రహం కోసం అక్షయ తృతీయ రోజు పప్పు దానం చేయాలి.

కర్కాటకం: ఈ రాశివారికి చంద్రుడు అధిపతి కనుక ముత్యంతో ఉన్న నగలను ధరించడం వల్ల ఈ రాశి వారికి చంద్ర బలం పెరుగుతుంది.

సింహం: అక్షయ తృతీయ రోజు సింహ రాశి వారు ఉదయమే నిద్రలేచి సూర్యునికి నీటిని సమర్పించి అనంతరం బెల్లం దానం చేయాలి.

కన్య: కన్య రాశి వారు నవరత్నాలలో ఒకటైన పచ్చ ధరించడం ఎంతో మంచిది. అక్షయ తృతీయ రోజు దీనిని ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

Image Courtesy : Wikipedia

తుల: తులా రాశి వారు అక్షయ తృతీయ రోజు తెల్లని వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు పగడం ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనస్సు రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు పసుపు రంగు దుస్తులను, వస్త్రాలను దానం చేయాలి.

మకర రాశి మకర రాశి వారు అక్షయ తృతీయ రోజు నువ్వుల నూనెను దానం చేయటం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు.

కుంభం: కుంభ రాశి వారు అక్షయ తృతీయ రోజు నల్లని నువ్వులు, కొబ్బరి, ఇనుము దానం చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలను పొందవచ్చు.

మీనం:మీన రాశి వారు అక్షయ తృతీయ రోజు పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.