అందరి జీవితాల్లో లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలి. అందుకోసం నిరంతరం ఆమెను స్మరిస్తూనే ఉంటారు. శుక్రవారం అష్టోత్తరాలు చదువుతూంటారు. అలాగే  లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందంటే మన ఆలోచనలు, వ్యవహారాల్లో మార్పులు వస్తుంది. రాగ-ద్వేషాలు, ఈర్ష్య అసూయలు లాంటివి తగ్గిపోతాతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరి చేరవు. ఇంట్లో మనస్పర్థలు, విబేధాలు, కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీ దేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. మరి అంతటి అద్బుతమైన మన జీవితాన్ని మార్చే శక్తి గల లక్ష్మీ దేవి గురించి తెలుసుకోవాలనిపిస్తోందా…

ఆర్థిక సమస్యలను అధిగమించడానికి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. తామర పవ్వు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. నవరాత్రి సందర్భంలో పూజ చేసేటపుడు తామర పువ్వును అమ్మవారికి సమర్పించాలి. లేకపోతే కనీసం తామర పువ్వు చిత్ర పటం వంటివి పెట్టుకోమంటారు దైవజ్ఞులు. అసలు లక్ష్మీదేవికు తామర పువ్వు కు మధ్య ఉన్న సంభందం ఏమిటి…

గమనించండి…తామర పువ్వు కొలనులో లేదా సరస్సులో పుడుతుంది.సరస్సులో ఉన్నటువంటి ఈ తామర పువ్వుకు నిలకడ ఉండదు.నీటి ప్రవాహం వచ్చినప్పుడల్లా అటూ ఇటూ కదులుతూ ఊగుతూ ఉంటుంది.అలాంటి తామర పువ్వు పై కూర్చుని మనకు దర్శనమిస్తున్న లక్ష్మీదేవి కూడా తను ఒక చోట స్థిరంగా ఉండనని, తాను నిలకడ లేని దానినని చెప్పడం కోసమే లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉంటారని చెప్తారు.

అలాగే మరో విషయం కూడా గమనించాలి..తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక.నిజానికి తామర పువ్వు బురద నుంచి పుడుతుంది. ఆ విధంగా బురద నుండి పుట్టినప్పటికీ తామర పువ్వుకు ఎలాంటి బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది.అదేవిధంగా మన జీవితంలో కూడా ఇతరుల గురించి పట్టించుకోకుండా సొంతంగా, స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది.

 ఇక లక్ష్మీదేవి ఇంటిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది. డబ్బుల వర్షం కురిపిస్తుంది. నవరాత్రి పర్వదినాన లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటి పూజగదిలో పెట్టుకుంటే వ్యాపార పురోగతి లభిస్తుందని అంటారు. వ్యాపారంలో బాగా వృద్ధి చెందుతుంది. వారికి విజయం ఎల్లవేళలా వరిస్తుంది.