సుష్ఠు ఈరణం గతి: యస్యాసౌ సూర్య:
సుష్ఠు ఈరణం ప్రేరణం యేనాసౌ సూర్య:

అంటే.. కాలానికి అనుగుణంగా చక్కని గమనం కలవాడు సూర్యుడు… అని,
 సకల జీవరాసులకు మంచి చైతన్యం ఎవరిచేత అయితే కలుగుతుందో అతడే సూర్యుడు, అని సూర్యశబ్దాలు రచించబడ్డాయి. దావరిదమ ఆ సూర్యుడే పరబ్రహ్మ స్వరూపుడని దీనికి అర్థం. ఆయన  వల్లే ఈ సృష్టి జరిగి, పోషించ బడుతోంది.

మన పూర్వీకులు సూర్యుడిని ఆరాధించి అనేక ప్రయోజనాలు పొందినట్లు మనకు పురాణాలు పేర్కొన్నాయి.  శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు కుష్టు రోగగ్రస్తుడైనపుడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం సాంబుడు సూర్యోపసన చేసాడు. దీంతో సూర్య భగవానుడు అతనికి స్వప్న దర్శనమిచ్చి తన ఏకవింశతి నామావళిని వినిపించి, పారాయణం చేయమన్నాడని పురాణాలలో ఉంది.  ఆ సూర్య ఏక విశంతి…ఇదే …మీరు పారాయణ చేయండి.

‘‘ భాస్కరో భగవాన్ సూర్యః చిత్రభానుర్విభావసుహు
యమః సహస్రాంశుమాలీయమునా ప్రీతిదాయకః
దివాకరో జగన్నాధః సప్తాశ్వస్య ప్రభాకరః
లోక చక్షుః స్వయంభూశ్చ ఛాయారతి ప్రదాయకః
తిమిరారిర్దినధవో లోకత్రయ ప్రకాశకః
భక్తబంధుః దయాసింధుః కర్మసాక్షీ పరాత్పరః
ఏకవింశతి నామాని, యః పఠేదుదితే మయి
తస్య శాంతిం ప్రయచ్ఛామి సత్యం సత్యం వదామ్యహమ్’’

ఈ సూర్యారాధన చేస్తే ఆయువు, ఆరోగ్యం పెరుగుతాయి. శుచితో భక్తితో సూర్యోదయం సమయంలో ఈ ఆరాధన చేయాలి. కనీసం 40 రోజులు చేస్తే మీకు మంచి ఫలితాలు కన్పిస్తాయి.

ఉదయించే సూర్యుడు, సాయం సూర్యుడి ముందు నిలబడి ఆ స్వామిని పై శ్లోకాలతో ఆరాధిస్తే తప్పక మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎంత ఉన్నా ఆరోగ్యం లేనిది జీవితం వ్యర్థం అనేది అందరికీ తెలిసిన సత్యం.