ఏప్రిల్ 15వ తేదీన కడప జిల్లా, ఒంటిమిట్ట కోదండరామ స్వామి  కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. సీఎం జగన్ కల్యాణ వేడుకకు హాజరు కానున్నారు. ప్రభుత్వ తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు కావచ్చునని అంచనా వేశామని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ముందుగా భగవత్‌ విజ్ఞాపన, సద అనుజ్ఞ, పుంజాహవచనం, లోక కళ్యాణంకోసం సంకల్పం చేయిస్తారు. తదుపరి ర క్షాబంధనం, యజ్ఞోప వీతపారణ, వరశ్రేషణం (కన్యావరణం), మధుపర్తాచన చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామ చంద్రుల ప్రవరణలు చదివారు. వంశ స్వరూపాన్ని స్తుతిస్తారు. తదు పరి మంగళసూత్రం పూజ, మాంగళ్యధారణ, అక్షకారోపణం చేపడతారు. అనంతరం స్వామి విభేదన, వేదస్వస్థి, ఆశీర్వచ నంతో కళ్యాణ ఘట్టం పూర్తి అవుతుంది.

 బ్రహ్మోత్సవాలు, స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  

కోవిడ్ కారణంగా రెండేళ్ళుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈసారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.