తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ వల్ల గత రెండు సంవత్సరాలుగా గుడి మొహం చూడని వాళ్లు కూడా అక్కడే క్యూ లు కట్టారు.  తెల్లవారుజాము నుంచే శివాలయాలు శివ నామ స్మరణతో మార్మోగిపోయాయి. శైవ క్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి పర్వ దినం సందర్భంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసుకున్నారు భక్తులు.

ఇక  వేములవాడ రాజన్న ఆలయంలో స్వామి వారికి మంత్రులు ఐకే రెడ్డి, గంగుల కమలాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. శివరాత్రి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 4 గంటలకు శివ దీక్ష స్వాములకు దర్శనం కల్పించారు. కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించారు.

అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేయిస్తంభాల ఆలయంలో మహాశివ రాత్రి వేడుకలు ఘనంగా కొన సాగాయి. భక్తులతో ఆలయం కిటకిట లాడాయి. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర సింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్ ఛాయాసోమేశ్వ రాలయం, పిల్లలమర్రి, వాడ పల్లి శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల సందడి నెలకొంది. తెల్ల వారుజాము నుంచే స్వామి వారికి ప్ర త్యేక పూజ లు, అభిషేకాలు నిర్వ హించారు. కీసర గుట్ట , ఏడుపాయల , బీరంగూడ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు త లెత్త కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.