రోహిణికార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిరకార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. జింక తల కలిగివుండటంతో ఈ కార్తెను మృగశిరకార్తెగా వ్యవహరిస్తారు. ఈ కార్తె మనదేశంపై విశేషప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువపనాలు భారత్లోకి ప్రవేశిస్తాయి. అప్పటివరకు నిప్పులు చెలరేగిన భానుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడుతాయి. దేశానికి జీవధార అయిన వర్షాలతో నేలతల్లి పులకరిస్తుంది. రైతులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. ఏరువాకసాగే కాలం అని కూడా అంటారు.
వర్షా కాలానికి నాంది పలికే మృగశిర కార్తె బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆరోజు గ్రామీణ ప్రాంతాల్లో పండుగ చేసుకుం టారు. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతారు. నాటు కోడి కూర తినడానికి మక్కువ చూపుతారు. ఖరీఫ్ సేద్యం కోసం రైతులు ఉగాది తర్వాత దుక్కిదున్ని పొలాలను సిద్ధం చేసుకుంటారు. రోహిణి కార్తెలో కురిసే మోస్తరు వానలకు ఆరుతడి పంటలైన కంది, పెసర వేస్తారు. జూన్ మొదటి వారంలో వచ్చే మృగశిర కార్తెలో మిగతా ఖరీఫ్ పంటలు వేస్తారు. ఇన్నాళ్లూ వేసవి వల్ల ఉక్కపోతతో సతమతమైన పల్లెలు, పట్టణ వాసులు మృగశిర కార్తె రోజు కురిసే తొలకరి జల్లులతో వేసవి తాపం తగ్గుతుందని గ్రామస్థుల నమ్మకం. అలాంటి మృగశిర కార్తె గురించి మన పెద్దలు ఏమి చెప్తారో చూద్దాం.
మృగశిర నక్షత్రం దేవగణానికి చెందినది. అధిపతి కుజుడు. రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి అదృష్టం కలిగివుంటారు. మృగశిర కార్తె వచ్చిందంటే సకలజనులకు వూరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరి జల్లులతో స్వాంతన చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిరకార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. జింక తల కలిగివుండటంతో ఈ కార్తెను మృగశిరకార్తెగా వ్యవహరిస్తారు.
ఈ కార్తె మనదేశంపై విశేషప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువపనాలు భారత్లోకి ప్రవేశిస్తాయి. అప్పటి వరకు నిప్పులు చెలరేగిన భానుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడుతాయి. దేశానికి జీవధార అయిన వర్షాలతో నేలతల్లి పులకరిస్తుంది. రైతులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. ఏరువాకసాగే కాలం అని కూడా అంటారు.
ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం వలన శరీరంలో కూడా సమతుల్యం దెబ్బతిన కుండా ఉండడానికి నేడు ఇంగువ బెల్లం కలిపి తీస్కోవడం అనేది మన ఆనవాయితీ.మృగశిర కార్తెన గ్రామీణులు మిరుగు కార్తెగా అభివర్ణిస్తారు. ఆ రోజు ఇళ్లలో తప్పని సరిగా ప్రత్యేక మాంసాహారాలు చేసుకుంటారు. మృగశిర ప్రవేశంతో వాతావరణం చల్లబడటంతో ఆ చలిని తట్టుకునేందుకు విధిగా నాటు కోడి మాంసాన్ని తింటారు.