చైత్ర మాసం లో కృష్ణ పక్ష ఏకాదశినాడు వరూధినీ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ వ్రతం ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇప్పుడిప్పుడే మనవాళ్లూ చేస్తున్నారు.
ఈ ఏకాదశి రోజున ఉపవసించి , దైవదర్శనం చేసుకుని జాగరణను పాటించేవారు ఇహలోకం లో సకల శుభాలనూ పొందగలరు. వారికి పరలోకం లోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయని మన ధర్మ శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే వరూధినీ ఏకాదశి రోజున కుంభమేళా స్నానం చేసిన వారికి విశేషఫలితాలు లభిస్తాయి. అందుకే కుంభమేళా సమయం లో వచ్చే వరూధినీ ఏకాదశిని ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ వ్రత మహిమ, పాటించవలసిన నియమములు ఏమిటో చూద్దాం.
వరూధినీ ఏకాదశి మహిమ భవిష్యోత్తర పురాణం లో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధినీ ఏకాదశి వ్రత మహిమను గురించి చెబుతాడు. ‘ధర్మరాజా వరూధినీ ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తననూ , సంఘం లో గౌరవాన్నీ , ధన సంపదలనూ పొందుతారు. అంతే కాదు వరూధినీ ఏకాదశి వ్రతం ఆచరించడం పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం తో సమానమైనది. సూర్య గ్రహణ సమయం లో సువర్ణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాంధాత వరూధినీ ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుండీ బయటపడ్డాడు. ‘ అని స్వయంగా కృష్ణ భగవానుడే వరూధిని ఏకాదశి మహిమను కొనియాడాడు.
వరుథిని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. పూజ సమయంలో వ్రత కథను పఠిస్తారు. కథను వినకుండా లేదా చదవకుండా, ఈ ఏకాదశి యొక్క పూర్తి ప్రయోజనం పొందలేరు.

వరుథిని ఏకాదశి వ్రతం కథ
ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరునికి వరుథిని ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. పూర్వకాలంలో నర్మదా నది ఒడ్డున మాంధాత అనే రాజు పరిపాలించేవాడని చెప్పాడు. ఒకసారి రాజు అడవిలో తపస్సు చేస్తుండగా ఒక అడవి ఎలుగుబంటి వచ్చి రాజు పాదాలను నమలడం ప్రారంభించింది. అప్పుడు మాంధాత రాజు తన రక్షణ కోసం విష్ణువును ప్రార్థించాడు. రాజు పిలుపు విన్న విష్ణువు ప్రత్యక్షమై తన చక్రంతో ఎలుగుబంటిని చంపాడు.
ఎలుగుబంటి రాజు కాలు తిన్నందున, రాజు అతని కాలు గురించి చాలా బాధపడ్డాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన భక్తుడిని విచారించి ఇలా అన్నాడు – ఓ వత్స! దుఃఖించకు నీవు మథురకు వెళ్లి వరుథిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, నా వరాహ అవతార మూర్తిని పద్దతి ప్రకారం పూజించండి. దాని ప్రభావంతో, మీ కాళ్ళు చక్కగా మరియు బలంగా మారుతాయి అన్నారు. మాంధాత రాజు అలాగే చేశాడు. ఈ ప్రభావం వల్ల అతను అందగాడుగా, నిండుగా తయారయ్యాడు. కావున, వరుథిని ఏకాదశి వ్రతమును ఆచరించి, శ్రీమహావిష్ణువును ధ్యానించిన భక్తునికి సర్వపాపాలు నశిస్తాయి. మరియు అతను స్వర్గాన్ని పొందుతాడు.
ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి.. ?
శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున హరినామ స్మరణం సకలపాప హరణం. అన్యమైన విషయాలలో మనస్సును చలించనీయక ఏకాగ్ర చిత్తం తో స్వామిని అర్చించాలి. ఉపవాస దీక్షలో పాలు పళ్ళు భుజించవచ్చు. ఆరోగ్యం సరిగా లేని వారు , చిన్న పిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు. నేడు వైష్ణవాలయాలలో ఉత్తరద్వార దర్శనం చేసుకొని స్వామిని మనసారా ధ్యానించాలి

నియమాలు
ఏకాదశి ఉపవాసానికి సంబంధించిన కొన్ని నియమాలు శాస్త్రాలలో చెప్పబడ్డాయి. ఈ నియమాలను పాటించడం చాలా ముఖ్యం. శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం.
ఈ రోజున ఉపవాసం పాటించే వ్యక్తి పసుపు బట్టలు ధరించాలి. అలాగే ‘వరుథినీ ఏకాదశి’ రోజున ఏ పసుపు వస్తువునైనా విష్ణుమూర్తికి సమర్పించండి. భోగ నైవేద్యంగా పెట్టేటప్పుడు అందులో తులసి ఆకులను తప్పకుండా చేర్చండి. కాదశి వ్రతం పాటించే వ్యక్తి తామసిక ఆహారం మరియు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఉపవాసం పాటించే వ్యక్తి మనస్సు, మాట మరియు కర్మల స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
శాస్త్రాల ప్రకారం, తులసి మహావిష్ణువుకు చాలా ప్రియమైనది, కాబట్టి తులసిని అతని పూజలో అన్ని విధాలుగా ఉపయోగించాలి. అటువంటి పరిస్థితిలో, ఏకాదశి రోజున పూజతో పాటు, తులసి మాలతో విష్ణువు మంత్రాలను జపించండి. ఇలా చేయడం వల్ల కోరిక నెరవేరుతుంది.
వరుథిని ఏకాదశి తిథి
ఏకాదశి తిథి ఏప్రిల్ 26, మంగళవారం ఉదయం 01.36 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 27, బుధవారం మధ్యాహ్నం 12.46 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఏప్రిల్ 26, మంగళవారం ఉపవాసం ఉంచబడుతుంది.
ఉపవాసము ప్రారంభము :- 26-4-2022 మంగళవారం మొదలుపెట్టవలెను.
ద్వాదశ పారణము :- 27-4-2022 బుధవారం ఉదయం 6.44నుండి 9.53 మధ్యలో ఉపవాసము విడువవలెను.